బల్లులతో ఇబ్బంది : బల్లుల బెడదా? ఇంట్లోనే ఈ స్ప్రే లు ఇలా చేయండి.. దెబ్బకు పోతాయ్!!

మన ఇంట్లో.. మనల్ని ఇబ్బంది పెట్టే కీటకాల్లో బల్లులు కూడా ఒకటి. ఇంట్లో గోడలపై పాకుతూ.. చూడటానికి చాలా చిరాకుగా.. భయంకరంగా, అసహ్యంగా ఉంటాయి. కొందరి ఇళ్లలో అయితే ఏకంగా వంటపాత్రలపై కూడా పాకుతూ.. మరింత చిరాకును కలిగిస్తాయి. తెలియక వాటిలోనే వంట చేయడం వల్ల కొన్నిరకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. 


కొందరు గృహిణులు కోడిగుడ్లు వండగా మిగిలిన పెంకులను పెట్టడంతో బల్లులుపోతాయని భావిస్తారు కానీ.. వాటివల్ల పెద్దగా ఫలితం ఉండదు. మార్కెట్ లో బల్లుల్ని పారద్రోలే వివిధ రకాల స్ప్రేలు ఉన్నా.. అవి పూర్తిగా రసాయనాలతో తయారు చేస్తారు కాబట్టి.. వాటిని వాడటం వల్ల బల్లులకు ఎంతమేర హాని ఉంటుందో తెలియదు గానీ.. మనం కూడా వాటి దుష్ప్రభావాల బారిన పడటం ఖాయం. ఇవన్నీ కాదు గానీ.. ఇంట్లోనే బల్లులను బయటకు పంపే ఓ స్ప్రే తయారు చేసి వాడితే.. ఫలితం ఉంటుంది. ఇందుకోసం సహజసిద్ధమైనవే వాడుతాం కాబట్టి.. మనకెలాంటి హానీ ఉండదు.

స్ప్రేలు తయారు చేయు విధానంవెల్లుల్లి-మిరియాల కాంబినేషన్: వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయ, ఐదు మిరియాలు, 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. ముందుగా ఒక జార్ లో 5 వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 5 మిరియాలను దంచినవి వేసి.. మిక్సీపట్టుకోవాలి. ఈ పేస్ట్ లో రెండుగ్లాసుల నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి.. ఒక స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న స్ప్రే ను బల్లులపై, ఇంటిలో బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో, పాత్రలపై చల్లాలి. వెల్లుల్లి, ఉల్లి, మిరియాల్లో ఉంటే ఘాటు వాసనకు బల్లులు ఇక ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. కర్పూరం: బల్లుల్ని తరిమికొట్టే మరో చిట్కా కూడా ఉంది. దానికోసం కర్పూరాన్నివాడాలి. ఒకగిన్నెలో నీరుపోసి వేడి చేసి.. ముద్దకర్పూరాన్ని పొడిగా చేసి వేయాలి. కర్పూరం బాగా కలిసేలా కలపాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్ లో పోసి ఇంటిలో బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో స్ప్రే చేయాలి. అలాగే ఒక గిన్నెలో అరచెక్క నిమ్మరసం, అర టీస్పూన్ డెటాల్, అర టీ స్పూన్ లైజాల్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో, బల్లులపై స్ప్రే చేస్తే.. బల్లులు పారిపోతాయి. ఈ చిట్కాలతో పాటు ఇంట్లో ఎప్పుడూ తాజా గాలి, వెలుతురు వచ్చేలా చూసుకుంటూ ఉండాలి. 

Comments