ఫ్రిజ్.. ఇది ఆడవారికి ఎంతలా ఉపయోగపడుతుందంటే.. మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం ఇప్పుడు అందరి ఇళ్లలోనూ ఫ్రిజ్ ఉంటుంది. ఇంతకుముందు మహిళలు ఏదైనా పని మీద బయటకు రెండు, మూడు రోజులు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవారు. ఇంట్లో మగవారు ఏం వండుకుని తింటారని తెగ ఆలోచించేవారు. కానీ ఫ్రిజ్ వచ్చాక.. ఆ ఇబ్బంది తగ్గింది లేడీస్ కి.
మహిళలు ఏదైనా ఊరు వెళ్లేటప్పుడు ఇంట్లోని వారికి ఇబ్బంది లేకుండా.. మగవారికి ఇష్టమైనవన్నీ వారం రోజులకు సరిపడా వండేసి రిఫ్రిజిరేటర్ లో పెడుతున్నారు. అలాగే సాధారణంగా ఇంట్లో మిగిలిన ఆహార పదార్థాలు ఉన్నా.. లేక బయట నుంచి కొన్న ఆహార పదార్థాలైన ఇప్పుడు అన్నీ ఫ్రిజ్ లోనే తోసేస్తున్నారు. పాడవదు కదా.. రేపే, ఎల్లుండో తిందాంలే అని ధీమాగా ఉంటున్నారు. ఆ తర్వాత అలా ఫ్రిజ్ నుంచి తీసి.. వేడి చేసుకుని తింటున్నారు. కానీ కొన్ని ఆహార పదార్థాలను వేడి చేయడం అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మరికొన్ని ఆహార పదార్థాలు అస్సలు వేడి చేసుకుని తినకూడదంట.. మరి అవేంటో తెలుసుకుందామా.
అన్నం: అన్నం మిగిలిపోతే మనం ఫ్రిజ్ లో పెట్టేస్తాం. ఆ తర్వాత రోజు వేడి చేసుకుని తినొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ సార్లు అన్నాన్ని వేడి చేసుకుని తినకూడదని వైద్యులు చెబుతున్నారు. బయట వాతావరణంలో ఉంచినప్పుడు హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి ఫ్రిజ్ లో అన్నం పెడితే ఒకసారి వేడి చేసుకుని తినండి. పాలకూర: పాలకూర వేసి వండే వంటలు ఫ్రిజ్ పెట్టొచ్చు కానీ.. అస్సలు వేడి చేసుకుని తినకూడదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
పుట్టగొడుగులు: పుట్టగొడుగులు వీటినే మష్రూమ్స్ అని కూడా అంటారు. ఈ కూర చేసినప్పుడు ఒక్కసారే వండుకుని తినాలి తప్ప.. ఫ్రిజ్ లో పెట్టుకుని పదే పదే వేడి చేసుకుని తింటే.. విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. చికెన్: చికెన్ కూడా అంతే. వండిన కూర మిగిలిపోతే ఫ్రిజ్ పెట్టుకుని తినొచ్చు కానీ.. చికెన్ కర్రీని మాత్రం అస్సలు వేడి చేయకూడదు. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని రిఫ్రిజిరేటర్ లో నిల్ం చేసి, మళ్లీ వేడి చేసి తింటే.. ఇందులో ఉండే ప్రోటీన్ విషంగా మారుతుందట. కాబట్టి చికెన్ కర్రీ మిగిలిపోతే ఫ్రిజ్ లో పెట్టుకుని, తినే ముందు ఓ అరగంట ముందు బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి.. అంతే తప్ప వేడి చేసుకుని తినకండి. ఏదైనా కూర లేదా అన్నాన్ని ఒక సారి వేడి చేసుకుని తింటే పర్లేదు. కానీ పదే పదే వేడి తింటే మాత్రం క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబ్టటి జాగ్రత్తలు వహించండి.
Comments
Post a Comment