ప్రస్తుత కాలంలో ఫిట్‌గా ఉండటం అనేది చాలా పెద్ద టాస్క్. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవనశైలితో పాటు.. శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవాలి. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే.. సరైన పండ్లు, కూరగాయలు తినాలి. పండ్లు, మంచి కూరగాయలు తినడం వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోజును ఆరోగ్యంగా ప్రారంభించాలంటే పండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయాన్నే పండ్లు తినడం వలన రోజంతా చురుకుగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏ పండ్లు తినాలి? ఏం తింటే మంచిది? అనే ప్రశ్న తలెత్తుతుంది. మరి ఉదయాన్నే ఏం పండ్లు తింటే మేలు జరుగుతుందో ఇవాళ మనం తెలుసుకుందాం..పండ్లు తినడానికి సరైన సమయం ఏది?ఖాళీ కడుపుతో తినే పండ్లు కొన్ని ఉన్నాయి. వీటిని అల్పాహారం, మధ్యాహ్న భోజనం మధ్య సమయంలో అంటే ఉదయం 10 నుండి 12 గంటల మధ్య కూడా తినొచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పండ్లను ఉదయం సమయంలో తినాలి. తద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Comments
Post a Comment