కొత్తిమీర ప్రయోజనాలు : కిడ్నీలను క్లీన్ చేసే కొత్తిమీర.. ఇలా వాడితే మంచి ఫలితం ఉంటుందండోయ్.. మిస్ చేయకండి!!

 మనం తినే ఆహారాలతోనే.. మన శరీరంలోని వ్యర్థాలను క్లీన్ చేసుకుంటూ.. ఆరోగ్యంగా జీవించవచ్చు. కానీ మనకేమో బద్ధకం, అశ్రద్ధ ఎక్కువ. తర్వాత చేసుకోవచ్చులే అని వదిలేస్తుంటాం. అలా చేయడం వల్ల నేలపై మురికి పేరుకున్నట్లు.. శరీరంలోని కొన్ని భాగాల్లో వ్యర్థాలు పేరుకుపోయి.. అనారోగ్యం బారిన పడుతుంటాం. 


మన శరీరంలా ప్రతీదీ ముఖ్యమే. అందులోనూ మూత్రపిండాల విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలి. శరీరంలోని వ్యర్థాలను వడపోసి.. వాటిని మూత్రం ద్వారా బయటకు పంపకపోతే ఒక్కరోజు కూడా బ్రతకలేం. అలాంటి మూత్రపిండాలను కూడా మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కొత్తమీరతో ఈ చిట్కాను పాటిస్తే.. మూత్రపిండాలను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. కొత్తిమీరను మనం ఎక్కువగా అన్ని కూరల్లోనూ వేసుకుంటాం. కర్రీ, వేపుళ్లు, పులుసు కూరలు, రసం, నాన్ వెజ్ వంటలు ఇలా ప్రతిదానిలో కొత్తమీర ఉండాల్సిందే. ధనియాల ద్వారా కొత్తిమీర తయారవుతుంది. దానిని వాడటం వల్ల ఆహారం త్వరగా అరుగుతుంది. కొత్తిమీరతో ఫ్లేవర్ డ్ రైస్ కూడా చేసుకుంటాం. అలాగే కొత్తమీర పచ్చడి కూడా తింటాం. ఇలా తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒక్క టీ స్పూన్ కొత్తిమీర రసం ఒక గ్లాసు మజ్జిగలో వేసి, అందులోనే చిటికెడు జీలకర్ర కలిపి రాత్రి భోజనం తర్వాత తాగాలి. ఇలా రోజూ తాగితే… కడుపులో మంట, పేగు పూయడం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే నోటిదుర్వాసన తగ్గుతుంది. చిగుళ్ల నుంచి రక్తం వచ్చేవారికి ఇది మంచి వైద్యమనే చెప్పాలి. మూత్రపిండాలను శుభ్రం చేసుకోవాలంటే..కొత్తిమీరను ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో నీరుపోసి గంటసేపు నానబెట్టాలి. అదే గిన్నెను స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలపాటు మరిగించాలి. స్టవ్ ఆఫ్ చేసి.. దానిపై ఆవిరిపోకుండా మూతపెట్టి చల్లారనివ్వాలి. ఇలా కాసిన కొత్తిమీర నీటిని వారానికి ఒకసారి ఒకగ్లాసు మోతాదులో తాగితే మూత్రపిండాలు శుభ్రపడతాయి.  మహిళలు ఈ నీటిని తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే గర్భిణులు కూడా రోజూ 2 టీ స్పూన్ల కొత్తమీర రసాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

Comments