జామకాయలన్నీ ఆకుపచ్చ లేదా పూర్తిగా పండినవి లేదా కాస్త నిమ్మ పండు రంగులో ఉన్నవే మీరు చూసి ఉంటారు. కొన్ని జామకాయలను కట్ చేసి చూస్తే లోపల గుజ్జు ఎర్రగా ఉంటుంది. కానీ ఈ నల్లజామకాయలు (Black Guava) ఏంటి ? ఇవెక్కడ దొరుకుతాయి ? వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి ? అనే కదా మీకు కలిగిన సందేహాలు.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పైకి నల్లగా కనిపించినా లోపల ఎర్రటి రంగులో గుజ్జును కలిగి ఉంటాయి ఈ నల్లజామకాయలు. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాండం కూడా నలుపు రంగులోనే ఉంటాయి.మామూలు జామకాయల్లో కంటే నల్ల జామకాయల్లో పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, పీచు పదార్థాలతో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలుంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఇవి రక్షిస్తాయి. శరీరంలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వృద్ధాప్య ఛాయలు రాకుండా నల్లజామకాయలు సహాయపడుతాయి. అలాగే మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎర్రరక్తకణాలు ఎక్కువగా తయారుచేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు నల్లజామకాయల్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి మంచి ఔషధం నల్లజామకాయలు. ఇవి షుగర్ ను తగ్గిస్తాయి. బరువు తగ్గడంలోనూ సహాయపడుతాయి. శరీరంలో కొవ్వు కరుగుతుంది.
Comments
Post a Comment