ఖమ్మం మార్కెట్ లోకి వచ్చిన ఈ పండ్లు వినియోగ దారులను ఆకట్టు కుంటున్నాయి.. ఈ పండ్లను వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. కిలో రాంబూటన్ పండ్ల ధర రూ. 400 గా అమ్ముతున్నారు. తీపి, పులుపు సమ్మిళితంతో ఉమ్మెంత కాయ ఆకారంగా ఎరుపు రంగులో ఉండే ఈ పండు.. తోలు చర్మం ఎర్రగా.. కండకలిగిన తేలికైన వెన్నుముకలతో కప్పబడి ఉంటుంది.
అందుకే దీనికి 'వెంట్రుకలు' అని అర్థం. వెన్నుపూస పండు అని కూడా పిలుస్తారు. ద్రాక్షను గుర్తుకు తెచ్చే తీపి, తేలికపాటి ఆమ్ల రుచితో ఉంటుంది .ఎరుపు రంగు లో కనిపిస్తున్న ఈ ఫ్రూట్స్ పేరు రాంబూటన్ పండ్లు..వీటిని ఎగబడి కొంటున్నారు.. ఎందుకో వీటికి అంత డిమాండ్ అనుకుంటున్నారా.. చూడండి.. ఖమ్మం మార్కెట్ లోకి వచ్చిన ఈ పండ్లు వినియోగ దారులను ఆకట్టు కుంటున్నాయి.. ఈ పండ్లను వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. కిలో రాంబూటన్ పండ్ల ధర రూ. 400 గా అమ్ముతున్నారు. తీపి, పులుపు సమ్మిళితంతో ఉమ్మెంత కాయ ఆకారంగా ఎరుపు రంగులో ఉండే ఈపండు మొదటగా తైవాన్, మలేషియా దేశాలలోనే లభ్యమయ్యేవి అట. ఆ తరువాత మన దేశంలోని శాస్త్రవేత్తలు సుమారు 70ఏళ్ల క్రితం కేరళలో పండించారు.
అక్కడి నుంచి ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా పండిస్తున్నారు. ఈపండులోని గుజ్జు తినడం వల్ల విటమిన్ సి తో పాటు ప్రొటీన్స్ పుష్కలంగా లభిస్తాయి.గుండె, కిడ్నీ, కండరాల పనితీరు మెరుగుపడుతుంది. బీపీ, షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుందని వైద్య నిపుణులు పేర్కోంటున్నారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లను నగరంలోని ఫ్రూట్స్ వ్యాపారులు కేరళ నుంచి తెప్పిస్తున్నారు. మంచి పోషకాలు, ఆరోగ్యానికి మేలు చేసే ఈ ప్రూట్స్ గురించి తెలుసుకొని.. వినియోగ దారులు.. కొనుగోలు చేస్తున్నారు.. చూడటానికి అందంగా ఉండి ఆకట్టు కుంటున్నాయి.
Comments
Post a Comment