కొత్తిమీర గింజలు బెన్‌ఫైట్స్ : ధనియాల వల్ల కలిగే ఈ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

 ధనియాలకు వంటల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ధనియాలు మంచి ఔషధం లాగా పని చేస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఇవి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ధనియాలతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వీటిలో వల్ల మనకి చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.మధుమేహంని నివారించడంలో ధనియాలు అద్భుతంగా ఉపయోగపడతాయి.


మధుమేహం రాకుండా ఉండడానికి కూడా ఇవి బాగా పని చేస్తాయి. ధనియాల పొడి కొలెస్ట్రాల్ ని నియంత్రణ లో ఉంచుతుంది. ధనియాలని గ్రైండ్ చేసి ఒక గ్లాసు నీళ్లు చేర్చి మరిగించి చల్లారిన తర్వాత వడగట్టి తాగితే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీన్ని కొన్నిరోజుల పాటు చేస్తే అద్భుతమైన ప్రయోజనం కనిపిస్తుంది.
పీరియడ్స్ సమయంలో ఆరు గ్రాముల ధనియాలను ఒక అర లీటర్ నీళ్లు కలిపి సగం నీళ్లు అయ్యేంత వరకూ మరిగించి, ఇందులో పటిక బెల్లం లేదా తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే రక్తస్రావం ఆధిక్యత తగ్గుతుంది. 

పైగా పీరియడ్స్ సరిగ్గా సమయానికి వస్తాయి.అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో ధనియాలు బాగా పని చేస్తాయి. గజ్జి, చర్మం, దురదలు, దద్దుర్లు, వాపులను తగ్గించడంలో ధనియాలు బాగా ఉపయోగపడతాయి.ధ‌నియాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మలబద్ధకం కూడా తగ్గుతుంది.ర‌క్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.అధిక బరువుతో బాధపడేవారు రోజూ ధనియాల నీటిని తాగడం వల్ల.. ఈ ప్రాబ్లెమ్ కి చెక్ పెట్టవచ్చు.ధనియాలు ఏ రూపంలో తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ధనియాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి మేలు చేస్తాయి.

 దీని కారణంగా ఫ్రీరాడికల్స్ ను ఎదుర్కోవడానికి బాగా సహాయపడతాయి. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ధనియాలు ఉపయోగ పడతాయి. ధనియాల పొడి మచ్చలను నివారిస్తుంది. ధనియాల పొడి లో పసుపు వేసి పేస్ట్ లాగ చేసి ముఖానికి పట్టించి ఉంచితే మంచి ఫలితం కనబడుతుంది.

Comments