TFCC ఎన్నికలు : తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు.. ప్యానెల్ విజయంతో పలు కీలక పోస్టులు కైవసం
ఉత్కంఠ వీడింది. తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఎన్నికల్లో నిర్మాత దిల్ రాజు ప్యానెల్ విజయం సాధించింది. దీంతో ఫిల్మ్ ఛాంబర్‌లోని పలు కీలక పోస్టులు దిల్‌రాజు ప్యానెల్ సభ్యులు కైవసం చేసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా ముత్యాల రామదాసు, సెక్రటరీగా దామోదర వరప్రసాద్, ట్రెజరర్‌గా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు.
అలాగే ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్‌గా కృష్ణ ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ చైర్మన్‌గా సుధాకర్, స్టూడియో సెక్టార్ చైర్మన్‌గా చారి ఎన్నికయ్యారు. కాగా మొత్తం 48 ఓట్లలో దిల్‌రాజుకు 31 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా తన విజయానికి సహకరించిన నిర్మాతలందరికీ కృతజ్ఞతలు తెలిపాడు దిల్ రాజు. ‘బంపర్ మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు. రేపటి నుంచి యాక్షన్‌లోకి దిగుతాం’ అని దిల్ రాజు పేర్కొన్నారు. కాగా ప్రచారంలో అయినా.. పోలింగ్‌లో అయినా.. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తక్కువ కాదు అనేలా ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. దిల్‌రాజు, సీ.కళ్యాణ్ ప్యానెల్ మధ్య రసవత్తర పోరు జరిగింది. పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం, ఛాంబర్ బైలాలో మార్పులు , ప్రభుత్వాలతో ఎగ్జిబిటర్ల సమస్యలపై ప్రణాళిక వంటి అజెండాతో దిల్ రాజు ప్యానెల్ రంగంలోకి దిగితే, చిన్న సినిమాల మనుగడ, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ఉనికి, ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారమంటూ సి. కల్యాణ్ ప్యానెల్ బరిలోకి దిగింది.
Comments
Post a Comment