కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక మందన్న ఇప్పటికే ఇక్కడ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపొయింది. ఇప్పుడు అదే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల కూడా టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపొయింది. ఎక్కడ చూసిన ముందు శ్రీలీల పేరే వినిపిస్తుంది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది శ్రీలీల.సినిమా ఇండస్ట్రీలో కొత్త అందాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఇప్పటికే టాలీవుడ్ లోనూ ఎంతో మంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్తగాట్టిగా వినిపిస్తున్న పేరు శ్రీలీల. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక మందన్న ఇప్పటికే ఇక్కడ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపొయింది. ఇప్పుడు అదే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల కూడా టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపొయింది. ఎక్కడ చూసిన ముందు శ్రీలీల పేరే వినిపిస్తుంది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది శ్రీలీల.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది.ఇప్పుడు శ్రీలీలకు పోటీగా మరో ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఆ చిన్నదాని పేరు మీనాక్షి చౌదరి. సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ సినిమాలో పద్దతిగా కనిపించి మెప్పించింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు ఈ బ్యూటీ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం లో చేస్తోంది మీనాక్షి చౌదరి. ఈ సినిమా నుంచి పూజ హెగ్డే తప్పుకోవడమతొ ఈ అమ్మడిని ఫిక్స్ చేశారు త్రివిక్రమ్. దాంతో ఒక్కసారిగా మీనాక్షి పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగింది. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ క్రేజ్ పెరిగింది.
నెట్టింట కూడా అందరూ మీనాక్షి కోసం సర్చ్ చేస్తున్నారు. అలాగే ఆమెను భారీగా ఫాలో అవుతున్నారు. ఇక ఈ అమ్మడికి అవకాశాలు కూడా భారీగా వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిన్నదాని చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ మట్కా లోనూ అవకాశం అందుకుంది. అటు శ్రీలీల ఎనిమిది సినిమాల వరకు ఉంటే మీనాక్షి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. దాంతో శ్రీలీలకు గట్టిపోటీ ఇచ్చేలా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మీనాక్షి స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందేమో చూడాలి.
Comments
Post a Comment