ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ చాలా మంది ఒకే ప్లేట్ లోని భోజనాన్ని షేరింగ్ చేసుకుని తింటూంటారు. అలా తినడం చాలా మందికి ఇష్టం. కాలేజీల్లో, ఆఫీసుల్లో ఇది కామన్. ఇంట్లో అయితే అమ్మనో లేక బామ్మనో అందరికీ ముద్దలు కలిపి పెడతారు. ఒక ప్లేట్ నుంచి అందరూ కలిసి భోజనం చేస్తే.. సామాజిక బంధాన్ని, సమిష్టి బంధాన్ని పెంపొందిస్తుందంటారు.
ఒకే ప్లేట్ లో భోజనం చేస్తే.. వ్యక్తుల మధ్య ఐక్యత, సాన్నిహిత్య భావన పెరుగుతందని పెద్దల నమ్మిక. అయితే ఒకే ప్లేట్ లోని ఫుడ్ చాలామంది తింటే నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకోండి.. జాగ్రత్తగా ఉండండి.ఒకే ప్లేట్ లో నుంచి అందరూ కలిసి తింటే జర్మ్స్, ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకరు అనారోగ్యం, ఇన్ ఫెక్షన్లతో బాధపడుతుంటే.. అది మిగిలిన వారికి కూడా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది.
జలుబు, ఫ్లూ, జీర్ణశయాంతర వ్యాధులు వంటి సాధారణ అంటువ్యాధులు ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతాయిఒకే ప్లేట్ లో ఫుడ్ షేర్ చేసుకుంటే.. ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. షేర్ చేసుకునే ఆహార ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లు బదిలీ అయ్యే అవకాశం ఉంది.క్రిములు సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.ఎవరికైనా నిర్దిష్ట ఆహార అవసరాలు, అలెర్జీలు ఉంటే, ఆహారాన్ని తదనుగుణంగా విడదీయమని చెప్పండి.
శుభ్రత గురించి జాగ్రత్త వహించండి.భోజనం పంచుకునే సమయంలో పరిశుభ్రంగా ఉండటం, ప్లేట్ , పరిసరాలు శుభ్రత పాటించండి.ఒకే ప్లేట్ లో అందరూ కలిసి తింటే.. మీరు తినే ఫుడ్ ను అంచనా వేయడం కష్టం అవుతుంది. దీని కారణంగా ఎక్కువగా తినే అవకాశం ఉంది.
Comments
Post a Comment